అధికారం.. అహంకారం
కందుకూరు: అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతు లేకుండా పోయింది. తాజాగా వారి కన్ను రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. తమకు అనుకూలం కాని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. మండలంలోని పలుకూరుకు చెందిన సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. మంగళవారం అతడికి చెందిన సర్వే నంబర్ 688, 695లో ఉన్న 4.50 ఎకరాల వెంచర్‌లో మున్సిపల్ అధికారులు హద్దు రాళ్లు తొలగించారు. ఈ వెంచర్ వేసి దాదాపు మూడు సంవత్సరాలవుతోంది. ల్యాండ్ కన్వర్షన్ కట్టడంతోపాటు, 30 అడుగుల రోడ్లు, విద్యుత్ లైన్‌ల వంటి అన్ని సదుపాయాలు కల్పించి అప్రూవల్ తీసుకున్నారు. అన్నీ అనుమతులున్నా ఎందుకు రాళ్లు తొలగిస్తున్నారని మున్సిపల్ అధికారులను సురేష్ ప్రశ్నించాడు. తాము ఏమీ చేయలేమని.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దగ్గర నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేను కలవాలని.. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు కలవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సురేష్ వేసిన వెంచర్ మహదేపురం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ నుంచి ల్యాండ్ కన్వర్షన్ వరకు అన్ని ఆ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ఆ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా దాని పరిధిలోనే రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు.
ఎకరాకు రూ.10 లక్షలు ఇవ్వాలంట
పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే మనుషులకు ఎకరాకు రూ.10 లక్షలు ఇవ్వాలని బేరం పెడుతున్నారు. నేను నగదు ఇవ్వలేదని మూడు సంవత్సరాల క్రితం వేసిన వెంచర్‌లో రాళ్లు తొలగిస్తున్నారు.
– సురేష్, బాధితుడు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యం
దివివారిపాళెం రోడ్డులోని లేఅవుట్‌పై దాడి
ఎమ్మెల్యేకు డబ్బులివ్వాలంటూ బెదిరింపు
Comments
Please login to add a commentAdd a comment