మానవత్వమా.. నీ జాడెక్కడ?
● గుండెపోటుతో బెంగాల్ వాసి మృతి
● పట్టించుకోని మేస్త్రి
● ఆస్పత్రి వద్ద మృతదేహంతో
కుటుంబసభ్యుల రోదన
విడవలూరు: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ వ్యక్తి మృతిచెందాడు. కుటుంబసభ్యుల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఏం చేయలేక మృతదేహాన్ని ఆస్పత్రి బయట పెట్టి కన్నీరుమున్నీరుగా రోదించారు. మానవత్వానికి మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన బుధవారం విడవలూరులో జరిగింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన కొందరు పొలం పనుల కోసం విడవలూరు గ్రామానికి వచ్చారు. బుధవారం పనిచేస్తున్న సమయంలో ఉమిత్ (30) అనే వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతడిని స్థానికంగా విడవలూరు పీహెచ్‌సీకి ట్రాక్టర్‌లో తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే గుండెపోటు తో ఉమిత్ మృతి చెందాడని నిర్ధారించారు. పనికి తీసుకెళ్లిన మేస్త్రి ఉమిత్ గురించి పట్టించుకోలేదు. వారి వద్దకు రాలేదు. తల్లి, కుటుంబ సభ్యులకు భాష తెలియకపోవడం, చేతిలో డబ్బుల్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని పీహెచ్‌సీ ఆవరణలో ఉంచి గంటల తరబడి కన్నీరుమున్నీరుగా రోదించారు. ఎవరూ సాయం చేయకపోవడంతో బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు చేతులతో మృతదేహాన్ని మోసుకెళ్లారు. పీహెచ్‌సీకి సమీపంలో ఖననం చేశారు. ఉమిత్‌కు వివాహం కాలేదు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment