నిద్రావస్థలో అధికారులు
సైదాపురం: మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులంతా నిద్రావస్థలోనే ఉన్నారనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. మండల కేంద్రమైన సైదాపురంలోని నడిబొడ్డులో ఆసుపత్రి వెనుక ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపదను నిల్వ ఉంచారు. లక్షలాది రూపాయల విలువైన ఖనిజ సంపద రవాణా చేసేందుకు బ్యాగుల్లో కట్టి రవాణా చేసేందుకు అక్రమార్కులు సిద్ధంగా ఉన్నారు. అక్కడే ఖనిజాన్ని గ్రేడింగ్ పనులు కూడా చేస్తుండటం గమనార్హం. ఎలాంటి అనుమతి లేని చోట అపారమైన ఖనిజం ఉండటంతో పాటు అక్కడే పనులను చేస్తున్న తీరు చూస్తుంటే అధికారులు ఉన్నారా... లేరా అనే అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా నిద్రావస్థలో ఉన్న మైనింగ్ అధికారులు కళ్లు తెరిచి అక్రమ రవాణాతో పాటు పనులను కూడా నిలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.
రవాణాకు సిద్ధంగా ఖనిజ సంపద
కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా పనులు
Comments
Please login to add a commentAdd a comment