● పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్ కుమార్
నెల్లూరు (పొగతోట): జిల్లాలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పంచాయతీ రాజ్ ఎస్‌ఈ అశోక్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీసీ రోడ్ల నిర్మాణంపై ఏఈలు, డీఈలు, మండల ఇంజినీరింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. నిర్మాణాల్లో లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లు నిర్మాణాలు జరిగే సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏఈలు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment