అభివృద్ధి పనులు పరిశీలించిన కేంద్ర బృందం
కలిగిరి: కలిగిరి, వెలగపాడు, నాగసముద్రం గ్రామాలలో జలశక్తి అభయాన్ కేంద్ర బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఐఆర్‌ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సశ్ఛీంద్రకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం సభ్యులు లోకేశ్, డి.లక్ష్మీనారాయణ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మినీ గోకులాలు, హార్టీకల్చర్, చెక్‌డ్యాములు, రూఫ్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ యూనిట్లను సందర్శించారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెటింగ్ చేసే విధానాలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక అధికారులకు సూచించారు. భూగర్భ జలాల పెంపుపై పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ గంగాభవాని, ఏపీడీ గాయత్రీదేవి, శంకరనారాయణ, ఏపీఓ శ్రీనివాసులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment