నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సముద్ర తీర ప్రాంత ప్రజలతో పాటు పెన్నానది పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, బోట్లు, వలలు జాగ్రత్త చేసుకునేలా చూడాలని ఆదేశించారు. పెన్నానదీ పరీవాహక గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. అధికార యంత్రాంగమంతా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులుంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 0861– 2331261 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment