పర్మిషన్ ఉన్న షాపుల నుంచే మద్యం సరఫరా
● అయినా పెనాల్టీ లేదు, లైసెన్స్ రద్దూ లేదు
● క్వార్టర్‌పై రూ.50 వరకు అదనపు వసూళ్లు
● అధికార పార్టీ క్యాడరే సూత్రధారులు
● అక్రమార్కులపై నామమాత్రపు కేసులు
● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు
బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం విక్రయాలు జరగాలి. గ్రామాల్లో ఎవరైనా మ ద్యం విక్రయాలు అక్రమంగా సాగిస్తే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా అక్రమ మద్యం సరఫరా, బెల్టు షాపులు నిర్వహిస్తే సహించేది లేదు. ఇప్పటికే గ్రామాల్లో నిఘా కూడా పెంచాం.
– లక్ష్మణ్‌స్వామి, ఎకై ్సజ్ సీఐ, ఉదయగిరి
సీతారామపురంలో మద్యం షాపు పక్కనే పర్మిట్ రూమ్
●
ఉదయగిరి : బెల్ట్ షాపుల్లో పట్టుబడిన మద్యం ఏ దుకాణమో గుర్తిస్తే మొదటసారి అయితే రూ.2 లక్షలు జరిమాన విధిస్తాం. రెండోసారి జరిగితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు మీడియా ముందు ప్రకటించారు. కానీ మూడు నెలల్లో జిల్లాలో దాదాపు 350 కేసులు నమోదైతే ఒక్క షాపునకు జరిమానా విధించడంగానీ, లైసెన్స్ రద్దు చేయడం కానీ జరగలేదు. ఈ షాపులన్నీ అధికార పార్టీకి చెందిన వారివి కావడమే. చంద్రబాబు చెప్పే మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతనే లేదని అర్థమవుతోంది. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక రేట్లకు విక్రయాలు చేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్‌పై రూ.50 వరకు అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎకై ్సజ్ అధికారులు అడపాదడపా దాడులు జరిపి ఆ శాఖ ఉనికి కోసం అరకొరగా కేసులు నమోదు చేస్తున్నారు. వ్యాపారంలో కూటమికి చెందిన గ్రామస్థాయి నేత నుంచి ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. దీంతో వారికి మూడు సీసాలు.. ఆరు గాజులు మాదిరిగా సిరులు కురుస్తున్నాయి. ప్రతి పల్లెలో మూడు నుంచి పది వరకు బెల్ట్ దుకాణాలను నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేయడంతో జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గతంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు సాగేవి. జిల్లాలో 80శాతం దుకాణాలు కూటమి నేతలే దక్కుంచుకున్నారు. ఇప్పుడు వారంతా నిబంధనలు గాలికి వదలి తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి పొందిన షాపుల నుంచి మద్యం సరఫరా చేస్తూ బెల్ట్ దుకాణాలు ప్రోత్సహిస్తున్నారు. పల్లెల్లో కూడా వీధి వీధికి మద్యం షాపులు దర్శనం ఇస్తున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో 21 లైసెన్స్‌డ్ షాపులు ఉండగా, 320 వరకు బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా.
జేబులకు చిల్లు
మద్యం షాపుల వద్దకు వచ్చి కొనుగోలు చేయలేని వారు గ్రామాల్లో ఉండే బెల్టు షాపుల నుంచి అధిక ధరలకు కొంటున్నారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.80 వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు. దుకాణంలో ఒక వ్యక్తికి కేవలం మూడు బాటిల్స్ మాత్రమే విక్రయించాలి. షాపుల వద్ద కూడా తాగడానికి వీల్లేదు. కానీ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు వెలిశాయి. ఇక్కడే అన్నీ జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న 22 మద్యం బాటిళ్లను కావలి ఎక్సైజ్ ఎస్సై దేవిక ఈ నెల 10న జలదంకిలో బెల్ట్ షాపు నిర్వాహకుడు బి.లక్ష్మీనారాయణ నుంచి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కానీ పట్టుబడిన మద్యం ఏ లైసెన్స్‌డ్ షాపునకు చెందినదో అధికారులకు తెలుసు. అయినా ఆ దుకాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం అది అధికార పార్టీ నేతల అండదండలతో నిర్వహిస్తుండమే.
Comments
Please login to add a commentAdd a comment