చిరు జల్లులు.. చలితో గజగజ
నెల్లూరు (అర్బన్): నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో బుధ వారం కూడా జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. మూడు రోజులుగా జిల్లాపై కారు మబ్బులు కమ్మేశాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, పసి పిల్లలు చలితో కూడిన వాతావరణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నగరంతోపాటు గ్రామీణ రోడ్లు రొచ్చు, రొచ్చుగా మారాయి. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మైపాడు, కొత్తకోడూరు, రామతీర్థం, ఇస్కపల్లి తదితర పలు ప్రాంతాల్లో సముద్రంలో 5 మీటర్ల వరకు అలలు ఎగసి పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వవెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజులు కూడా జిల్లాలో తేలికపాటి జల్లులు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వీఆర్‌కు రాపూరు
సీఐ విజయకృష్ణ
● నూతనంగా చిన్న సత్యనారాయణ
నియామకం
సైదాపురం: రాపూరు సీఐ విజయకృష్ణను వీఆర్‌కు పంపుతూ బుధవారం అధికారికంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో బాపట్ల జిల్లా ఎస్బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న చిన్న సత్యనారాయణను రాపూరు సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధ్యతలు చేపట్టిన విజయకృష్ణ కొద్ది రోజుల్లోనే వీఆర్‌కు పంపడం గమనార్హం.
పేకాట స్థావరంపై దాడి
● రూ.1.58 లక్షలు స్వాధీనం
మనుబోలు: మండల పరిధిలోని వడ్లపూడి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మనుబోలు పోలీసులు దాడులను బుధవారం చేపట్టారు. పేకాటాడుతున్న 16 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1,57,940ను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివరాకేష్ తెలిపారు. వడ్లపూడి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాటాడుతున్నరనే సమాచారంతో వెంకటాచలం ఎస్సై, తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment