ఆర్టీసీ బస్సులో 12 కేజీల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్ట్
నెల్లూరు సిటీ: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకుని, వారి నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. విజయవాడ విద్యాధరపురం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్ విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తోంది. బస్సులో తనిఖీలు చేయగా అనుమానం వచ్చి ఓ సంచిని పరిశీలించారు. అందులో 12 కేజీల ఆరు ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం తిరుచరాపల్లి జిల్లాకు చెందిన ఇలావరసన్, తమిళనాడు నమక్కల్ జిల్లాకు చెందిన రాగుల్ ధవకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సేలంకు తరలిస్తుండగా..
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో గంజాయిని అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలోని గోవింద్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశామన్నారు. నెల్లూరు 1 ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు, సబ్ ఇన్‌స్పెక్టర్ జేకేవీఎన్ మురళీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, కానిస్టేబుల్స్ అజీజ్‌బాషా, ఎస్‌కే రఫీ, ఎం.రాజాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment