కోడి పందేలపై దాడులు
కావలి: తుమ్మలపెంట గ్రామ శివారు ప్రాంతాల్లో కోడి పందేలపై పోలీసులు దాడులను బుధవారం చేపట్టారు. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై తిరుమలరెడ్డి, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కోడి పందేలు ఆడుతున్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.5,600, మూడు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. గ్రామాల్లో కోడి పందేలు, పేకాట తదితరాలను నిర్వహిస్తున్నారని తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
మర్రిపాడు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం తనిఖీ చేశారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది పనితీరును ఆరాతీశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ గోపీనాథ్‌కు సూచించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment