పొరుగు మద్యం పట్టివేత
మర్రిపాడు: బస్సులో తరలిస్తున్న పొరుగు రాష్ట్ర మద్యాన్ని ఉదయగిరి ఎకై ్సజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఉదయగిరి ఎకై ్సజ్ ఎస్సై లక్ష్మణస్వామి వివరాల మేరకు.. మండలంలోని బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో, ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా సీఎస్‌పురానికి వెళ్తున్న శ్రీనివాసులురెడ్డి వద్ద 37 ఫుల్ మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. పండగల నేపథ్యంలో మద్యాన్ని బెంగళూరు నుంచి గ్రామానికి తీసుకెళ్తున్నారనే అంశం వెల్లడైందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్‌ను తీసుకొచ్చినా, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment