రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
వెంకటాచలం: రోడ్డుపై గుంతల కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన మండలంలోని తిక్కవరప్పాడు – గొలగమూడి గ్రామాల మధ్య గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కంటేపల్లి పడమర గిరిజన కాలనీకి చెందిన బాణాల శీనయ్య (40) అనే వ్యక్తి పని నిమిత్తం సర్వేపల్లికి స్కూటీపై వెళ్లాడు. తిరిగి కంటేపల్లికి వస్తుండగా దారిలో తిక్కవరప్పాడు – గొలగమూడి మధ్య రోడ్డుపై ఉన్న గుంతల్ని చూసి తప్పించబోయాడు. ఈ సమయంలో స్కూటీ అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో శీనయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందిండంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment