రేషన్ సరుకుల పంపిణీ ఎప్పుడు?
● శ్రీనివాసపురంకాలనీ గిరిజనుల ఆకలి కేకలు
కోవూరు: జనవరి నెలకు సంబంధించి ఐదు రోజులు గడిచినా మండలంలలోని గంగవరం మజరా శ్రీనివాసపురంకాలనీలో గిరిజనులకు రేషన్ సరుకులు పంపిణీ చేయకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మానికల మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం గిరిజన సంఘ నాయకులతో కలిసి కాలనీలో క్షేత్రస్థాయి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో వాసులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మాట్లాడుతూ కూలినాలి చేసుకొంటేనే పూట గడిచే గిరిజనులకు సక్రమంగా బియ్యం ఇవ్వడం లేదని, ప్రతి రోజు వారు శ్రీనివాసపురం సెంటర్లో పడిగాపులు కాస్తు, ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారన్నారు. వ్యక్తిగత కక్షలతో సకాలంలో బియ్యం అందకుండా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ విధంగా జరుగుతుందని, వెంటనే స్పందించి సకాలంలో బియ్యం అందేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment