● హాజరుకానున్న
10 వేల మందికి పైగా విద్యార్థులు
నెల్లూరు (టౌన్): ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షకు అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి 24 వరకు, 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాలెంలోని ఇయాన్ డిజిటల్ సెంటరు, కోట మండలం విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, మళ్లీ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఎన్టీయే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పార్ట్ సైజ్ ఫొటో, ఒరిజనల్ గుర్తింపు కార్డు, బాల్‌పాయింట్ పెన్ను, దివ్యాంగులైతే సంబంధిత అధికారి జారీ చేసిన సర్టిఫికెట్‌ను తప్పని సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలోకి కాలుక్యులేటర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాచ్‌లు, సెల్‌ఫోన్ తదితర వాటిని అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment