రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం
నెల్లూరు(అర్బన్): రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీలోని అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ నినాదాలతో రూపొందించిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ సూర్యతేజతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పోలీసులు, రవాణా శాఖాధికారులు పని చేయాలన్నారు. ట్రాన్స్‌పోర్టు, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, డీటీసీ చందర్, ఆర్‌టీఓలు శ్రీచందన, సుధాకర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ చౌదరి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఖాదర్‌వలీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు గంగాధరం, అశోక్‌కుమార్, రామ్మోహన్, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment