బుద్ధిమాంద్యులపై కూటమి నిర్దయ
పుట్టపర్తి అర్బన్: నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారిన బుద్ధి మాంద్యులపై కూటమి ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్‌ను అందజేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.
స్పందనకు వెల్లువెత్తుతున్న వినతులు
ఎంత వయసు వచ్చినా తన పని కూడా చేసుకోలేక నిత్యం వీల్‌చైర్, మంచాలకే పరిమితమవుతున్నారు. ఓ కుటుంబంలో బుద్ధిమాంద్యం చిన్నారి ఉంటే వారి సంరక్షణతోనే మరొకరికి పూర్తి రోజు గడిచిపోతోంది. ఇలాంటి చిన్నారులకు పింఛన్ పెంచి ఇస్తామంటూ గత ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు హామీనిచ్చారు. అయితే అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా... కూటమి సర్కార్ హామీని నిలబెట్టుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు 45 నుంచి 90 శాతం పైగా బుద్ధి వైకల్యంతో బాధపడుతున్న వారందరూ పింఛన్‌కు అర్హులు. వీరిలో చాలా మందికి అందుతున్న రూ.6 వేలు పింఛన్ వారి కనీస వైద్య ఖర్చులకూ సరిపోవడం లేదు. ఈ క్రమంలో పెంచిన రూ.15 వేలు పింఛన్ అందజేయాలంటూ ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (స్పందన) కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.
కొంత మందికే రూ.15 వేలు పింఛన్
ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 85 శాతం పైగా వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.15 వేల పింఛన్‌ను అందజేస్తామని ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీనిచ్చిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. మంచానికి పరిమితమైన 1,256 మందికి, కండరాల బలహీనతతో బాధ పడుతున్న మరో 804 మందికి మొత్తంగా 2,060 మందికి మాత్రమే రూ.15 వేలు పింఛన్ అందుతోంది. కిడ్నీ బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, బోదకాలుతో నడవలేనివారు. ఏ పనీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న హెచ్‌ఐవీ రోగులు, బుద్ధిమాంద్యం రోగులు ఇలా వేలాది మంది పెంచిన రూ.15 వేలు పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ 85 నుంచి 100 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్లు ఉన్నాయి.
రూ.15 వేలు పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు
బుద్ధిమాంద్యం 1,280 మందికి పైగా
డయాలసిస్ రోగులు 228 మంది
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ రోగులు 83 మంది
హెచ్‌ఐవీ బాధితులు 1,632 మంది
బోదకాలు బాధితులు 11 మంది
మొత్తం బాధితులు 3,234 మంది
రూ.15 వేలు పింఛన్
అందుతున్న వారి సంఖ్య 2,060
పింఛన్ కోసం
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
పెంచిన పింఛన్ అందజేయాలని వినతులు
స్పష్టమైన ఆదేశాలు జారీ చేయని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment