బిర్సా ముండా పోరాటం ఆదర్శనీయం
ప్రశాంతి నిలయం: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బిర్సా ముండా ప్రముఖ పాత్ర పోషించారు.. అయన పోరాటం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1894 సంవత్సరం అక్టోబర్ 1న జార్ఖండ్ రాష్ట్రం కుంతీ జిల్లా ఉలిహతు ప్రాంతంలోని ముండాలందరిని సమీకరించి పన్ను మాఫియా కోసం ఒక ఉద్యమం ప్రారంభించారన్నారు. పేదల పక్షాన నిలబడి పలు పోరాటాలు చేస్తూ పోరాట స్ఫూర్తిని రగిలించారన్నారు. 1900 సంవత్సరం జూన్ 9న ఆయన స్వాతంత్య్ర సమరయోధుడిగా తుది శ్వాస విడిచారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, డీఆర్‌డీఎ పీడీ నరసయ్య, ఏఓ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతి నిలయంలో
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రశాంతి నిలయానికి తరలిరానున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రశాంతి నిలయంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ సత్యసాయి విమానాశ్రయం, ప్రశాంతి నిలయం ప్రవేశ ద్వారాలు, సాయికుల్వంత్ సభా మందిరం, పూర్ణచంద్ర అడిటోరియం, శాంతిభవన్ అథితి గృహం, మహానారాయణ సేవ నిర్వహించే మైదానంతో పాటు ప్రశాంతి నిలయంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదన్నారు. అవసరమైన సిబ్బందిని అందుబాటులో పెట్టుకోవాలన్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజును కలసి వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీ విజయ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ జెడ్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిలకడగా ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఎండు మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌కు శుక్రవారం 200 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా.. మొదటి రకం క్వింటా రూ. 18 వేలు, రెండో రకం రూ.8 వేలు, మూడో రకం 7 వేలు పలికాయి. వాతావరణ మార్పుతో పూర్తిస్థాయిలో ఎండిన సరకు మార్కెట్‌కు రావడం తక్కువైందని మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. రైతులు బాగా ఎండించిన సరుకు తీసుకువస్తేనే మంచి ధరలు లబిస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment