తక్కువ వడ్డీకే రుణాలని మోసం
మడకశిర: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ కస్టమర్లను మోసగించింది. ఈసంస్థలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందిన కస్టమర్లు మోసపోయారు. చివరకు మోస పోయిన బాధితులు 100కు కాల్ చేసి ఈసంస్థపై ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆశీర్వాద్ గోల్డ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. పలువురు తమ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఈక్రమంలో ఆ సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన కస్టమర్లు రుణాన్ని చెల్లించడానికి వస్తే కట్టించుకోకుండా ఫోన్‌పే చేయించుకున్నాడు. అయితే ఆ ఉద్యోగి ఈ డబ్బును రుణానికి జమ చేయకుండా స్వాహా చేశాడు. బంగారు ఆభరణాలపై రూ.40 వేలు అప్పు తీసుకోగా.. ఇంకా ఎక్కువ తీసుకున్నట్లు నమోదు చేసుకుని మరోవ్యక్తిని మోసగించాడు. బేగార్లపల్లికి చెందిన జయమ్మ అనే మహిళ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకుంది. కూతురి వివాహం కోసం డబ్బులు చెల్లించి బంగారు ఆభరణాలు విడిపించుకోవడానికి వచ్చింది. అయితే రూ.లక్ష అప్పు తీసుకున్నావని, రూ.10 వేలు మాత్రమే చెల్లించావని, మిగిలిన రూ.90 వేలు చెల్లించి బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. ఇలా ఈ సంస్థ మోసాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. చివరకు జయమ్మతో పాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సంస్థ కార్యాలయానికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులు సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయికిరణ్ అనే వ్యక్తి ఆ సంస్థకు చెందిన రూ.13 లక్షల డబ్బు వాడుకున్నట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. 13 మంది ఖాతాదారులను అతను మోసం చేసినట్లు గుర్తించామన్నారు. అతన్ని ఇప్పటికే ఆ సంస్థ సస్పెండ్ చేసిందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికి
తాళం వేసిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment