జిల్లా వ్యాప్తంగా వర్షం
● 32 మండలాల్లో 13.3 మి.మీ
సగటు వర్షపాతం నమోదు
పుట్టపర్తి అర్బన్: ఫెంగల్ తుపాను ప్రభావంతో మూడో రోజు మంగళవారం జిల్లాలోని 32 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా రామగిరి మండలంలో 33.4 మి.మీ, ధర్మవరం మండలంలో 31.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.ఇక గోరంట్ల 22.4, తలుపుల 19.6, నల్లచెరువు 17.4, కదిరి 17.2, ముదిగుబ్బ 16.8, ఓడీచెరువు 16.8, తాడిమర్రి 16.6, బత్తలపల్లి 16.4, ఎన్‌పీకుంట 15, సీకేపల్లి 14.6, గాండ్లపెంట 14.2, సోమందేపల్లి 13.8, నల్లమాడ 13.4, కనగానపల్లి 12.6, రొళ్ల 12.2, బుక్కపట్నం 12, కొత్తచెరువు 11.6, అమడగూరు 11.2, పెనుకొండ 11, మడకశిర 9.6, గుడిబండ 9.6, తనకల్లు 9.4, పరిగి 9, లేపాక్షి 8, హిందూపురం 6.4, అమరాపురం 6, అగళి 5.6, రొద్దం 5.2, చిలమత్తూరు 4.2, పుట్టపర్తి మండలంలో 3.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. దీంతో జిల్లాలోని 32 మండలాల పరిధిలో 13.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాను ప్రభావం జిల్లాపై బుధవారం కూడా ఉంటుందన్నారు. తుపాను ప్రభావంతో రబీలో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు కళకళలాడుతున్నాయి.
విశ్రాంత ఉద్యోగుల
సమస్యల పరిష్కారానికి కృషి
ధర్మవరం రూరల్: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఏటీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెన్షనర్లు సంఘం అధ్యక్షుడు చలపతి, ట్రెజరీ పద్మనాఽభం ఆధ్వర్యంలో సభ్యులు మోహన్‌రావు ఘనంగా సన్మానించారు.
‘సైబర్’ ప్రచారం
విస్తృతం చేయండి
● ప్రజలు ఉచ్చులో చిక్కుకోకుండా
అవగాహన కల్పించండి
● సిబ్బందికి ఎస్పీ రత్న ఆదేశం
పుట్టపర్తి టౌన్: ఇటీవల జిల్లాలోనూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు సైబర్ నేరస్తుల ఉచ్చుకు చిక్కకుండా అవగాహన కల్పించాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎీస్పీలు, సీఐలు, ఎస్‌ఐ లతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న... ఇప్పటివరకూ జిల్లాలో నమోదైన సైబర్ కేసులు.. దర్యాప్తు, పరిష్కరించిన కేసులపై ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తుపై దృష్టి సారించాలన్నారు. ఇటీవల అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇటీవల కాలంలో చాలా మంది సెబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకుని రూ.లక్షలు నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా కొరియర్, లోన్‌యాప్, హనీట్రాప్, లాటరీలు, డెబిట్ కార్డులు, న్యూడ్ వీడియో కాల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త పడేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రచారం విస్తృతం చేయాలని సూచించారు. అలాగే ప్రధాన పట్టణాల్లో పోస్టర్లు అతికించాలన్నారు. ఒకవేళ ఎవరైనా ‘సైబర్’ ఉచ్చులో పడితే సంఘటన జరిగిన వెంటనే 1930 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, లేదా www. cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ సాయం అందుతుందన్న విషయం అందరికీ వివరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సైబర్ క్రైమ్ సీఐ తిమ్మారెడ్డి, డీసీఆర్‌బీ సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment