నష్టపరిహారం నివేదికలు సిద్ధం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో వివిధ జాతీయ రహదారులు విస్తరణలో భాగంగా పలు పాఠశాలలకు నష్టం జరిగిందని, వాటికి పరిహారం చెల్లించేందుకు డిసెంబర్ 10లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారుల విస్తరణ పనులు, పరిహారం చెల్లింపు అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా కొన్ని పాఠశాలల అదనపు గదులు, వంట గదులు, ప్రహరీలు, మరుగుదొడ్లు, బోర్లు తొలగించాల్సి వచ్చిందన్నారు. ఆయా మండలాల ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో ఎంతమేర నష్టం జరిగిందో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఇంజినీర్ల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లోని బోర్లు తనిఖీ చేసి పాఠశాలల విద్యార్థులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్‌హెచ్ –342, బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు, ఎన్‌హెచ్–761జి రహదారులకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో ఎంఈఓలు గోపాల్ నాయక్, పద్మప్రియ, రెడ్డయ్య, సమగ్ర శిక్ష అభియాన్ ఇంజినీర్లు, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో విచారణ చేసి
10వ తేదీలోపు సమర్పించాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment