లేపాక్షి ఆలయంలో స్కానర్లు
లేపాక్షి: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు కానుకలు సమర్పించేందుకు వీలుగా మంగళవారం ఆలయంలో స్కానర్లు అమర్చారు. నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడిన భక్తులు.. హుండీ ద్వారా స్వామివారికి కానుకలు సమర్పించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటి చైర్మన్ కరణం రమానందన్ తెలిపారు. దీన్ని గుర్తించి స్కానర్ల ద్వారా భక్తులు కానుకలు స్వామివారికి సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో హుండీల ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి 484 చీరలు, వీరభద్రస్వాముల వారికి 197 పంచెలు సమర్పించుకున్నారని, వాటిని వేలం వేయడమా, లేక పేదలకు ఇవ్వడమా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నరసింహమూర్తి, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా హుండీ కానుకలు సమర్పించే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment