తహసీల్దార్ డ్రైవర్‌దే కీలక పాత్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘పచ్చ’ నేతలు రచ్చ చేస్తున్నారు. దాడులు, దందాలతో సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఇంకొందరు నేతలు
అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ
స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇచ్చిన భూములకూ నకిలీ పట్టాలు సృష్టించి
దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇలా ఓ తెలుగు తమ్ముడు బుక్కపట్నం మండలంలో
అసాంఘిక శక్తిగా మారాడు. 1995లో
నిరుపేదలకు ఇచ్చిన భూమిని కబ్జా చేశాడు. తహసీల్దార్ సాయంతో నకిలీ పట్టాలు
సృష్టించి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేశాడు.
మిగులు
భూములపై కన్ను
బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయాన్నే అడ్డాగా మార్చుకున్న టీడీపీ నేతలు... తహసీల్దార్ షాబుద్దీన్ సహకారంతో మండలంలో ప్రభుత్వ మిగులు భూములను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే వందల ఎకరాలకు పట్టాలు పొందినట్లు తెలుస్తోంది.
సాక్షి టాస్క్ ఫోర్స్: బుక్కపట్నం మండలం కొత్తకోట రెవెన్యూ గ్రామ పరిధిలోని నార్శింపల్లి తండాలోని నిరుపేదల భూములపై ఓ టీడీపీ నాయకుడు కన్నేశాడు. గ్రామ సర్వే నంబర్ 1030–2వ లెటర్‌లోని 5 ఎకరాల్లో 1995లో అప్పటి సీఎం ఎన్‌టి రామారావు తండా వాసులకు పట్టాలిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 100 మంది ఇళ్లు నిర్మించుకుని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కూడా పూర్తి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022లో నిరుపేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంది. రూ.10 వేలు కడితే ఇళ్ల పట్టాలు పొందిన వారికి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ క్రమంలోనే నార్శింపల్లి తండాలో పట్టాలు పొందిన వారిలో 10 మందికిపైగా లబ్ధిదారులు రూ.10 వేలు చెల్లించి గ్రామ సచివాలయాల ద్వారా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పట్టాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.
రికార్డులు తారుమారు
Æ>çÙ‰…ÌZ MýS*rÑ$ {糿¶æ$™èlÓ… A«¨-M>-Æý‡…ÌZMìS Æ>V>¯ól sîæyîlï³ ¯ól™èlË$ {糿¶æ$™èlÓ ¿¶æ*Ð]l¬-ÌSOò³ ç³yézÆý‡$. ెÐðl¯]l*Å A«¨-M>Æý‡$ÌS¯]l$ Ð]l$_aMýS ^ólçÜ$MýS$° GMýSP-yðlMýSPyýl {糿¶æ$™èlÓ ¿¶æ*Ð]l¬-Ë$¯é²-Ƈ$$... GMýSPyýl Ñ$VýS$Ë$ ¿¶æ*Ð]l¬-Ë$-¯é²-Ķæ$…r* BÆ> ¡Æ>Æý‡$. D {MýSÐ]l$…ÌZ¯ól ¯éÇØ…ç³ÍÏ ™èl…yéOò³ ÐéÇ MýSâ¶æ$Ï ç³yézƇ$$. AMýSPyýl Aç³µ-sìæMóS 100 Ð]l$…¨ Câ¶æ$Ï °ÇÃ…^èl$MýS$° °ÐéçÜ… E…r$¯é²... GÌêOVðS¯é ÝëÓ«-©¯]l… ^ólçÜ$-Mø-ÐéÌS° ´ëϯŒS ÐólÔ>Æý‡$. D {MýSÐ]l$…ÌZ çÜÆó‡Ó ¯]l…ºÆŠ‡ 1030&2Ð]l ÌñærÆŠ‡ ¿¶æ*Ñ$ ÇM>-Æý‡$zË$ ™éÆý‡$-Ð]l*Æý‡$ ^ólÔ>Æý‡$. A¯]l…-™èlÆý‡… ÇM>Æý‡$zÌZÏ çܧýlÆý‡$ çܦÌê°² Ñ$VýS$Ë$ ¿¶æ*Ñ$V> ^èl*í³…-_... 4.09 GMýS-Æ>-ÌS¯]l$ Mö™èl¢Mør sîæyîlï³ º*™Œæ MýSÑ$sîæ MýS±-Ó-¯]lÆŠ‡ ¯]lVýSÇ Æ>gôæ‹Ù õ³Æý‡$™ø ç³sêt gêÈ ^ólíÜ Ayýl…-VýS-ÌŒæÌZ OòÜ™èl… GMìSP…-^éÆý‡$. C…§ýl$MýS$ ™èlçßæ-ïÜ-ÌêªÆŠ‡ Úëº$©ª¯ŒS ç³NÇ¢ Ýë¦Æ‡$$ÌZ çÜçßæ-MýS-Ç…_-¯]lr$Ï ™ðlË$Ýù¢…¨. A…™ól-M>MýS$…yé ¯]lVýSÇ Æ>gôæ‹ÙMýS$ D¯ðlÌS 10Ð]l ™ól©¯]l Ð]l¯ŒS&½ MýS*yé Ð]l$…þÆý‡$ ^ólÔ>Æý‡$. ©…™ø B çܦÌS…ÌZ Cç³µ-sìæMóS íܦÆý‡-°-Ðé-ÝëË$ HÆ>µr$ ^ólçÜ$MýS$¯]l² 100 MýS$r$…-»êË$ ¡{Ð]l B…§øâýæ¯]l ^ðl…§ýl$-™èl$-¯é²Æ‡$$. §é§éç³# Ð]lÊyýl$ §ýlÔ>-»êªÌS {MìS™èl… ™èlÐ]l$MìS-_a¯]l çܦÌê-°MìS C糚yýl$ ç³sêtË$ GÌê CÝë¢-Æý‡…r* ™èl…yé ÐéçÜ$Ë$ {ç³Õ²-çÜ$¢-¯é²Æý‡$.
కృష్ణాపురం, రామసాగరంలోనూ తమ్ముళ్ల భూ దందా
మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సచివాలయానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత కట్లపాటి నారాయణస్వామి కబ్జా చేసి అక్రమంగా పునాది వేసుకున్నాడు. అలాగే రామసాగరంలోనూ టీడీపీ నేతలు రూ.30 లక్షల విలువైన చెరువు వంక పోరంబోకును ఆక్రమించి చదును చేసుకున్నారు.
నార్శింపల్లి గిరిజన కాలనీలో కబ్జా పర్వం
పేదల స్థలాలను ఆక్రమించిన
టీడీపీ బూత్ కన్వీనర్ రాజేష్
అధికారుల అండతో
ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు
తన పేరుతో పట్టా...
పాసు పుస్తకం పొందిన టీడీపీ నేత
అక్రమాలకు మద్దతు తెలిపిన
తహసీల్దార్ షాబుద్దీన్
బుక్కపట్నం మండలంలో జరుగుతున్న భూకబ్జా బాగోతంలో తహసీల్దార్ డ్రైవర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏ పని కావాలన్నా ముందుగా తహసీల్దార్ డ్రైవర్‌ను కలిసి ఆయన డిమాండ్ చేసినంత ఇచ్చుకుంటే పని అయిపోతుందని స్థానికులు చెబుతున్నారు. లేకపోతే నెలల తరబడి తిరిగినా పనులు కావడం లేదంటున్నారు. తహసీల్దార్ డ్రైవర్‌కు తోడుగా ఇటీవల మరో ముగ్గురు టీడీపీ నేతలు కూడా తహసీల్దార్ కార్యాలయంలోనే తిష్ట వేసి వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారితో భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయం కాస్తా టీడీపీ ఆఫీసుగా మారిందని, కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా తహసీల్దార్ షాబుద్దీన్ టీడీపీ నేతలతో పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ కనిపిస్తారని జనం చెబుతున్నారు. అందువల్లే చాలా మంది తహసీల్దార్‌ను కలవకుండానే వెళ్లిపోతున్నారు.
తిరుగుబాటు తప్పదు
మేము మూడు దశాబ్దాలుగా నార్శింపల్లి తండాలో ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. మా కాలనీలో 100 ఇళ్లకుపైగా ఉన్నాయి. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మిగులు, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ టీడీపీ నేతలకు అధికారులు అక్రమంగా పట్టాలిచ్చారు. వన్–బీ సైతం మంజూరు చేయటం అన్యాయం. మా స్థలం జోలికొస్తే తిరుగుబాటు తప్పదు. – మునిబాయి,
నార్శింపల్లి తండా, బుక్కపట్నం మండలం
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిని కబ్జా చేసిన టీడీపీ నేతలు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలి. మూడు దశాబ్దాల క్రితం మాకిచ్చిన భూములను ఆక్రమిస్తున్నారంటే టీడీపీ నేతలు ఎంతకు తెగించారో తెలుస్తోంది. ఎమ్మెల్యే పల్లె సింధూరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించి టీడీపీ నేతల భూ అక్రమాలపై విచారణ చేయించాలి.– సుధాకర్‌నాయక్,
నార్శింపల్లి తండా, బుక్కపట్నం మండలం
Comments
Please login to add a commentAdd a comment