వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: మండలంలోని జీజీహట్టి గ్రామంలో మంగళవారం బేవినహళ్లి కరియమ్మదేవి జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్ణాటకలోని శిర నియోజకవర్గం గౌడగెర హోబళి బేవినహళ్లి గ్రామంలో వెలసిన కరియమ్మదేవి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం సాయంత్రమే ఊరేగింపుగా జీజీ హట్టి గ్రామానికి తీసుకువచ్చి యత్తప్పస్వామి ఆలయ ప్రాంగణంలో పట్టంపై కూర్చోబెట్టారు. మంగళవారం ఉదయం యత్తప్పస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కరియమ్మదేవి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు జ్యోతులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి విగ్రహం చుట్లూ ప్రదక్షిణలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యాదవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment