పరిగి: మండలంలోని మోదాలో ఏడేళ్ల క్రితం మహిళపై జరిగిన అత్యాచార యత్నం కేసులో నిందితులుగా ఉన్న దిలీప్, జోగిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు... 2017, డిసెంబర్ 17న మోదా సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న దిలీప్, జోగి... అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పరిగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితులు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు విస్తృత గాలింపు చేపట్టి మంగళవారం అదుపులోకి తీసుకుని హిందూపురంలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment