1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ ఆదేశాలమేరకు భూముల మార్కెట్ విలువ పెంపునకు సంబంధించి పనులను ఈనెల 27 నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మార్కెట్ విలువల సవరణ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పెంచిన మార్కెట్ విలువను ప్రజలకు తెలిసే విధంగా రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24 వరకూ ప్రజలు తెలియజేయవచ్చన్నారు. డిసెంబర్ 27న విలువల నిర్ణయ కమిటీలో చర్చించి ఆమోదం పొందిన తర్వాత జనవరి 1 నుంచి మార్కెట్ విలువను పెంచుతామన్నారు. సమావేశంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉమ్మడి జిల్లా అధికారిణి విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్ కృష్ణకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి, సబ్‌రిజిస్టార్లు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం..
గుడిబండ: ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చని జేసీ అభిషేక్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మోరుబాగల్‌లో ప్రకృతి వ్యవసాయం, రాగి పంట విస్తీర్ణం పెంపుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జేసీ అభిషేక్‌కుమార్, డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. రైతులు తయారు చేసిన కషాయాలను పంటలకు ఏ దశలో, ఎలా వాడాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment