సత్ప్రవర్తన అలవర్చుకోండి
ధర్మవరం అర్బన్: సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు సత్ప్రవర్తనతో మెలుగుతూ విడుదలైన అనంతరం కుటుంబసభ్యులతో కలసి మంచి జీవితం వైపు అడుగు వేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్‌యాదవ్ తెలిపారు. పట్టణంలోని సబ్‌జైలును గురువారం ఆయన తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లను పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, 70 ఏళ్లు పైబడిన వారి అనారోగ్య సమస్యలపై ఆరా తీశారు. కోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ బ్రహ్మేంద్రరెడ్డి, న్యాయవాదులు బాలసుందరి, మోహన్‌ప్రసాద్, ప్యారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా, సబ్‌జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment