బాలుడి అదృశ్యం.. విషాదాంతం
పెనుకొండ: పట్టణంలో బాబయ్య దర్గా గంధం ఉరుసుకు తల్లిదండ్రులతో కలసి వచ్చిన బాలుడు అహ్మద్ ఆల్మర్ (04) అదృశ్యం విషాదాంతంగా ముగింది. నిన్న మొన్నటి వరకూ బాలుడు కిడ్నాప్ అయ్యాడనే పోలీసులతో పాటు అందరూ భావించారు. అయితే గురువారం ఉదయం బాలుడు బాబయ్య దర్గా సమీపంలోని లెట్రిన్ పిట్‌లో పడి మరణించాడన్న సమాచారం రావడంతో పోలీసులు, దర్గా పేట వాసులు, భక్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ. వెంకటేశ్వర్లు సిబ్బంది ఆ ప్రాంత పెద్దల సమక్షంలో బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. బాబయ్య దర్గా సమీపంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసిన దర్గా నిర్వాహకులు ఆ ప్రాంతంలో పిట్ తవ్వి దాన్ని అలాగే వదిలేశారు. అయితే ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఉన్నా ఆ ప్రాంతానికి బాలుడు ఎలా వెళ్లి లెట్రిన్ పిట్‌లో పడి చనిపోయాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కారకులపై తగిన చర్యలు చేపడతామన్నారు.
దర్గా అభివృద్ధి పట్టించుకోని వక్ఫ్‌బోర్డు..
బాబయ్య దర్గా ఉరుసు, గంధం వేడుకలకు సంబంధించిన నిర్వహణను వక్ఫ్‌బోర్డు తీసుకుంది. ఏటా హుండీలు లెక్కిండమే తరువాయి డబ్బు వక్ఫ్ బోర్డుకు వెళ్తుంది. అయితే ఏ ఒక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేయని వక్ఫ్‌బోర్డ్ దర్గాకు వచ్చే ప్రతి రూపాయి తీసుకుని దర్గా అభివృద్ధికి, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి అహ్మద్ ఆల్మన్ ఉదంతం నిదర్శనంగా నిలుస్తుందని చెబుతున్నారు.
లెట్రిన్ పిట్‌లో శవమై తేలిన అహ్మద్ ఆల్మర్
Comments
Please login to add a commentAdd a comment