గుడిబండ: చిరుత దాడిలో ఓ దూడ మృతి చెందింది. గుడిబండ మండలం మద్దనకుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తిమ్మప్ప తన పశువులను, దూడలను వ్యవసాయ పొలంలో బోరు బావి వద్ద కట్టేసి ఉంచేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పొలంలోకి ప్రవేశించిన చిరుత కట్టేసిన దూడను చంపి సగానికిపైగా అక్కడే తిసేసింది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు దూడ కళేబరాన్ని చూసి సమాచారం ఇవ్వడంతో సర్పంచ్ జగదాంబ కృష్టప్ప, స్థానికులు, అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment