ఓవరాల్ చాంపియన్ ఏఆర్ జట్టు
పుట్టపర్తి టౌన్: పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ చాంపియన్ విజేతగా ఏఆర్ (ఆర్మ్‌డ్ రిజర్వ్) జట్టు నిలిచింది. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు శుక్రవారం ముగిశాయి. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, షటిల్, మ్యూజికల్ చైర్స్, 100 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్, లిఫ్టింగ్ సహా 20 క్రీడల్లో ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఓవరాల్ చాంపియన్‌గా ఆర్మ్‌డ్ రిజర్వ్ జట్టు నిలవగా.. రెండో స్థానంలో ఆల్ వింగ్స్ జట్టు నిలిచింది. చివరగా ఎస్పీ, ఏఎస్పీ జట్లు టగ్ ఆఫ్ వార్ ఆడారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో ఎస్పీ రత్న జట్టు గెలుపొందింది. అనంతరం ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో ఎస్పీ రత్న మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరచిన స్ఫూర్తితోనే విధుల్లో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అర్ల శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు, కేవీ మహేష్, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, ఆర్‌ఐలు వలి, రవికుమార్, మహేష్, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్‌సింగ్, వీరన్న, పీఈటీలు వెంకటేష్, రామకృష్ణ, సూర్యనారాయణ, సుధాకర్, నాగరాజు, స్వర్ణ, ఉషారాణి, సుహాసిని పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. అదనపు జిల్లా జడ్జి శైలజ, ఎస్పీ రత్న, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment