పాత పద్ధతుల్లోనే వైద్య సౌకర్యాలు కల్పించాలి
పుట్టపర్తి టౌన్: ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు పాత పద్దతుల్లోనే వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీ మహల్‌లో ఈయూ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి అధ్యతన శుక్రవారం ఆ శాఖ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆరు డిపోల నుంచి ఈయూ సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన దామోదరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతా భావంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.గత 12 సంవత్సరాలుగా కారుణ్య నియామకాల్లో తప్పా ఏ కేడర్‌లోనూ ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఈయూ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇర్షాద్, జోనల్ నాయకులు శేఖర్, అరుణమ్మ, నబీరసూల్, రీజనల్ అధ్యక్షుడు కేబీఎస్ రెడ్డి, కార్యదర్శి జీవైపీరావు, జిల్లా నాయకులు నారాయణస్వామి, ఆర్‌ఎస్ రెడ్డి, ప్రసాద్, రమణప్ప, శ్రీనివాసులు, విజయలక్ష్మి, సాదిక్, బాబు నరసింహులు, ఆరు డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
పలిశెట్టి దామోదరరావు
Comments
Please login to add a commentAdd a comment