పేదల పెన్నిధి వైఎస్ జగన్
సోమందేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేదల పాలిట పెన్నిధి అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లిలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణుల సమక్షంలో ఆమె భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహంతో పాటు వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్ సర్కిల్ నుంచి సాయిబాబా ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికీ జగన్ పెద్దపీట వేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారన్నారు. ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను కూటమి సర్కారు మూట గట్టుకుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమిని రాబోవు ఎన్నికల్లో సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, నరసింహ, తిమ్మయ్య, నరసింహమూర్తి, వీరనారాయణరెడ్డి, మేదర శంకర, జెడ్పీటీసీ అశోక్, ముఖ్యనాయకులు చరణ్‌రెడ్డి, ఫక్రుద్దీన్, రమాకాంత్‌రెడ్డి, కంబాలప్ప, శివారెడ్డి, సర్పంచ్‌లు అంజినాయక్, జీలాన్, కిష్టప్ప, సింగిల్‌విండో చైర్మన్లు ఆదినారాయణరెడ్డి, సూర్య ప్రకాష్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment