గుత్తి: రైలు ప్రయాణికురాలిపై ఓ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడు. వివరాలు... విజయవాడ దుర్గమ్మ ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు నిర్వహణకు జిల్లాకు చెందిన పలువురు కానిస్టేబుళ్లు గురువారం రాత్రి ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు(17216)లో బయలుదేరారు. రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణిస్తున్న వీరిలో గుత్తి పీఎస్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న యువతి పట్ల అనుచితంగా ప్రవరిస్తూ తన కోరిక తీర్చాలని బెదిరింపులకు దిగాడు. విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేయడానికి సిద్ధం కావడంతో టాయిలెట్‌లోకి దూరి తలుపు వేసుకున్నాడు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రయాణికులు టాయిలెట్ తలుపు బద్ధలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అక్కడున్న వయో వృద్ధులు కల్పించుకుని వారించడంతో ప్రయాణికులు శాంతించారు. కాగా పరువు పోతుందని భావించిన బాధితురాలు... కానిస్టేబుల్ దుశ్చర్యపై ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment