యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య

Published Sat, Dec 21 2024 12:36 AM | Last Updated on Sat, Dec 21 2024 12:36 AM

యువకు

యువకుడి హత్య

కుందుర్పి: మండలంలోని వడ్డెపాళ్యం గ్రామానికి చెందిన గిత్తరాజు (28) హత్యకు గురయ్యాడు. జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని శీగలపల్లి క్రాస్‌ వద్ద గురువారం రాత్రి ఆయనను దుండగులు హతమార్చారు. కాగా, కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన ఓ యువతితో గిత్తరాజు వివాహేతర సంబంధం నెరపేవాడు. ఈ క్రమంలో యువతి తరఫు కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వారే పథకం ప్రకారం గిత్తరాజును హతమార్చినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కర్ణాటకలోని పరుశురాంపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పరుశురాంపురంలో ఒకరిని, మలయనూరులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా, హతుడు గిత్తరాజుకు భార్య ఈశ్వరమ్మ, ఆరు నెలల వయసున్న చిన్నారి ఉన్నారు.

ఆస్పత్రి ఆవరణలో వృద్ధుడి మృతి

అమరాపురం: మండలంలోని నగోనపల్లి గ్రామానికి చెందిన జోగన్న (60) మడకశిర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ఆంజనేయస్వామి కట్ట వద్ద మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... కోర్టు కేసు నిమిత్తం మడకశిరకు వెళ్లి వస్తానని శుక్రవారం ఉదయం భార్య గౌరమ్మకు తెలిపి జోగన్న బయలుదేరారు. కోర్టు వద్ద అడ్వకేట్‌తో మాట్లాడిన అనంతరం అస్వస్థతకు గురి కావడంతో అక్కడే ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని ఆంజనేయస్వామి కట్ట వద టవాల్‌ పరుచుకుని నిద్రించాడు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది లేపడానికి ప్రయత్నించినా ఆయనలో చలనం లేకపోవడంతో సమాచారం అందుకున్న వైద్యులు అక్డకు చేరుకుని పరిశీలించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మడకశిర పోలీసులు విచారణ చేపట్టారు.

వ్యక్తి దుర్మరణం

గోరంట్ల: ద్విచక్ర వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని గోరంట్ల మండలం కాటేపల్లికి చెందిన వడ్డె హరి (35)గా గుర్తించారు. హిందూపురంలో నివాసముంటున్న ఆయన స్వగ్రామంలో ఉన్న తల్లిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై శుక్రవారం వచ్చాడు. తల్లిని పలకరించిన అనంతరం రాత్రి తిరుగు ప్రయాణమైన ఆయన పాలసముద్రం వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

హాకీ జట్ల ఎంపిక పోటీలు రేపు

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల 22న జిల్లా సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలుర హాకీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సూర్యప్రకాష్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న సబ్‌ జూనియర్‌ క్రీడాకారులు జనవరి 17 నుంచి 20 వరకు మదనపల్లిలో జరిగే సబ్‌ జూనియర్‌ హాకీ పోటీల్లో పాల్గొంటారు. జూనియర్‌ హాకీ పోటీల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. సబ్‌ జూనియర్‌ క్రీడాకారులు 01–01–2009 అనంతరం, జూనియర్‌ క్రీడాకారులు 01–01–2006 అనంతరం జన్మించి ఉండాలి. క్రీడాకారులు ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌తో ఆదివారం ఉదయం 9 గంటలకు క్రీడా మైదానానికి చేరుకోవాలి.

మజ్దూర్‌ యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శిగా విజయ్‌కుమార్‌

గుంతకల్లుటౌన్‌: దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్‌ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో జోనల్‌ కార్యదర్శి సీహెచ్‌ శంకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన యూనియన్‌ త్రైవార్షిక జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో జోన్‌ పరిధిలోని వివిధ డివిజన్ల కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్‌ను ఎన్నుకోన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యువకుడి హత్య 1
1/1

యువకుడి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement