రేషన్ బియ్యం స్వాధీనం
బత్తలపల్లి: కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 62 క్వింటాల్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన పక్కా సమాచారం మేరకు అప్రమత్తమైన విజిలెన్స్ సీఐ కె.శ్రీనివాసులు... డీసీటీఓ సురేస్‌కుమార్, బత్తలపల్లి సీఎస్‌డీటీ రామకృష్ణను కలుపుకుని శుక్రవారం బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి సమీపంలోని ప్రైవేట్ పాల డెయిరీ ఎదుట వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాటా 407 (ఏపీ21టీజెడ్2205) వాహనాన్ని అడ్డుకుని పరిశీలించడంతో 124 బస్తాల్లోని 62 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడింది. కర్ణాటకలోని బంగారుపేటకు బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా డ్రైవర్ అంగీకరించాడు. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని సీఎస్‌డీటీ రామకృష్ణకు అప్పగించారు. బియ్యం తరలిస్తున్న ఎరికల మహేష్ (నార్పల), సోమందేపల్లికి చెందిన నరేష్ (బయ్యర్), డ్రైవర్ బోయ సతీష్ (స్నేహలత కాలనీ, సోమందేపల్లి), సహాయకుడు అశ్వత్థనారాయణ (సోమందేపల్లి)ను అదుపులోకి తీసుకుని బత్తలపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేశారు.
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఐఓ
లేపాక్షి: స్థానిక పీహెచ్‌సీని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ నాగేంద్రనాయక్ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేసారు. ల్యాబ్, ఫార్మసీ, లేబర్‌వార్డులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారి డాక్టర్ వెంకటచిరంజీవి, ఎంపీహెచ్‌ఈఓ సుబ్రహ్మణ్యం, సీహెచ్‌ఓ, సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment