ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు
పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున విచ్చేయగా ఆదివారం సాయంత్రం వేద పఠనంతో కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీ, స్టార్స్, విద్యుత్ వెలుగులతో సాయికుల్వంత్ మందిరం మెరిసిపోతోంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ గాయని అనాలూవ్ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది. ప్రముఖ సంగీత కళాకారులు డాక్టర్ తానియా గోల్డ్‌బర్గ్ వయోలిన్, స్టాన్‌సైడేజ్ పియానో, సాయిజిత్ తబల బృందం సహకారం అందించారు. పలువురు భక్తులు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులను మహా సమాధిపై ఉంచి సత్యసాయికి సమర్పించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ సంగీత కళాకారులను ఘనంగా సత్కరించారు.
ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ
Comments
Please login to add a commentAdd a comment