జవాబు పత్రాలు దగ్ధం
ఓడీచెరువు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుల గది తాళం పగలగొట్టి బీరువాలోని విద్యార్థుల జవాబు పత్రాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కొన్ని జవాబు పత్రాలు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రత్న.. డీఎస్పీ విజయ్‌కుమార్, స్థానిక మల్లికార్జునరెడ్డితో కలసి ఆదివారం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించి పాఠశాల హెచ్‌ఎంతో వివరాలు ఆరా తీశారు. వెంటనే ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని ఎస్పీ రత్న సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment