అల్లుకున్న నిర్లక్ష్యం
పెనుకొండ: రాచరిక వైభవానికి నిలయం పెనుకొండ. పురాతన ఎన్నో కట్టడాలు, దేవాలయాలు, కోటగోడ, ఖిల్లా, పసరక్కరి, పాలక్కరి బావులు, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన గగన్‌మహల్ ఇక్కడ ఉన్నాయి. అయితే పురావస్తుశాఖ ఈ కట్టడాల అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కోటగోడలు, దేవాలయాలు, ఇతర కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్నా వారు నిద్రావస్థను వీడటం లేదు. నాటి రాచరికపు వైభవాన్ని, రాజుల ఘనతను గుర్తుకు తెచ్చుకుంటున్నామే తప్ప నాటి కట్టడాలను పరిరక్షించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పురావస్తుశాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. కోటగోడలు, దేవాలయాలు, ఇతర కట్టడాలు దయనీయస్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి. భావితరాలకు రాచరికపు వైభవం తెలుసుకునే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడటంతో ప్రస్తుతం కోటగోడను తీగ చెట్లు అల్లుకుపోయాయి. కొన్ని నేడో రేపో కూలే పరిస్థితికి చేరాయి. ఇప్పటికై నా పురావస్తుశాఖ అధికారులు నిద్రమత్తును వీడి నాటి రాచరికపు ఆనవాళ్లను కాపాడాలని పర్యాటక ప్రియులు, పట్టణ వాసులు కోరుతున్నారు.
నిద్రావస్థలో పురావస్తుశాఖ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment