మెడికల్ షాపుల తనిఖీ
హిందూపురం: ‘డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారం మందులను విక్రయించడం నేరం. మత్తుకు సంబంధించిన మందుల విక్రయాలను గుర్తిస్తే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయించడానికి సిఫార్సు చేస్తాం’ అని డీఎస్‌పీ కేవీ మహేష్ అన్నారు. ఎస్‌పీ వి.రత్న ఆదేశాల మేరకు.. హిందూపురం పట్టణంలోని పలు మెడికల్ షాపులను డీఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు రాజగోపాల్‌నాయుడు, కరీమ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమయ్య ఆదివారం తనిఖీ చేశారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్‌లో తనిఖీ నిర్వహించారు. మెడికల్ స్టోర్ యజమానులు బిల్లులు లేకుండానే మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. అలాగే అనుమతిలేని ఔషధాలను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు తేల్చారు. 1940 డ్రగ్స్ , కాస్మొటిక్స్ చట్టానికి విరుద్ధంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. కొందరు ఈ ఔషధాలను మత్తు కోసం మద్యం బదులు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ పేర్కొన్నారు. మెడికల్ షాపులకు అనుమతి పత్రాలు లేకుండా విక్రయాలు చేపట్టినా, మత్తుకు సంబంధించిన ఏ మందులు విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని మందులు విక్రయిస్తున్న మెడికల్ స్టోర్ యజమానిపై డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో కేసు నమోదు చేశామని డీఎస్పీ మహేష్ తెలిపారు.
ఓ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment