ప్రజల ఆరోగ్యం కోసమే ‘స్వచ్ఛాంధ్ర’
పుట్టపర్తి అర్బన్: ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికే స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ ఫైరోజ్ బేగం అన్నారు. శనివారం వైద్యాధికారులతో కలిసి ప్రశాంతి గ్రామంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల వద్ద చెత్తా చెదారం, కలుపు మొక్కలు తొలగించి పచ్చదనం పెంపొందించాలన్నారు. ప్రతి నెలా మూడో శనివారం అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ‘స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్’ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎల్‌ఏటీఓ డాక్టర్ తిప్పయ్య, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ నివేదిత, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో బాబా ఫక్రుద్దీన్, సూపరింటెండెంట్లు ఉదయ్, నాగభూషణ, స్టాటిస్టికల్ ఆఫీసర్ కళాధర్, డాక్టర్ గాయత్రి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment