రద్దు నిర్ణయం దుర్మార్గం
నాకు గత ప్రభుత్వంలో పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి దగ్గర స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేశారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇంటి నిర్మాణం ప్రారంభించలేకపోయాను. నాలాంటి వారు చాలా మందే ఉన్నారు. మా అందరికీ మరింత చేయూతనందించి ఇంటి నిర్మాణానికి సహకరించాలి. అది చేయకుండా పట్టాలు రద్దు చేస్తామనే నిర్ణయం దుర్మార్గం.
– లక్ష్మీదేవి బాయి, పుట్టపర్తి
ఆర్థికసాయం చేస్తే
ఇల్లు కట్టుకుంటా
గత ప్రభుత్వం జగనన్న లే అవుట్‌లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేసింది. అయితే డబ్బు సమస్యతో ఇంటి నిర్మాణం చేపట్టలేక పోయా. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోలేనివారి పట్టాలు రద్దు చేస్తామని చెబుతోంది. ఇది అన్యాయం. కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలు ఇస్తామని చెబుతోంది. మాలాంటి వారికి ఆ మొత్తం ఇస్తే వెంటనే ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకుంటాం.
– నాగమ్మ బాయి, ప్రశాంతి గ్రామం, పుట్టపర్తి
Comments
Please login to add a commentAdd a comment