కమనీయం... శ్రీనివాసుడి కల్యాణం
ప్రశాంతి నిలయం: టీటీడీకి చెందిన వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలు...భక్తుల జయజయ ధ్వానాల నడుమ వేంకటేశ్వరుడి కల్యాణం కమనీయంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి జిల్లా సత్యసాయి సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రశాంతి నిలయంలోని పూర్ణ చంద్ర ఆడిటోరియంలో శ్రీనివాస కల్యాణోత్సవ వేడుకలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుడిని కనులారా దర్శించుకుని తరించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేంకటేశ్వరుడి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని పూర్ణచంద్ర ఆడిటోరియంలోని వేదికను ప్రత్యేక ఫల, పుష్ప, దళాలతో అలంకరించారు. కల్యాణోత్స వేడుకలతో ప్రశాంతి నిలయంలో పండుగ వాతారణం నెలకొంది. వేడుకల్లో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment