బీరువాల వర్కర్ హత్య
● భార్య, ప్రియుడిపై తల్లి ఫిర్యాదు
హిందూపురం అర్బన్: పట్టణంలో బీరువాల వర్కర్ దారుణహత్యకు గురయ్యాడు. భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లు హతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. రహమత్‌పురంలో నివాసముండే అల్లాబకాష్(33) బీరువాల వర్కర్‌గా పనిచేస్తూ తల్లి, భార్య, ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. ఈయన భార్య తబసుమ్‌కు అదే ప్రాంతానికి చెందిన నదీం అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో వీరికి అడ్డుగా ఉన్నాడని అల్లాబకాష్‌ను అడ్డు తొలగించాలనుకున్నారు. శనివారం ఉదయం అల్లాబకాష్ విగతజీవిగా గదిలో పడి ఉన్నాడు. ఏమైందని అల్లాబకాష్ తల్లి అడిగితే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తబసుమ్ సమాధానమిచ్చింది. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానితురాలు కింద భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. తానే చున్నీతో గొంతు బిగించి చంపినట్లు అంగీకరించింది. అయితే భార్య తబసుమ్ ఆమె ప్రియుడు నదీం సహకారంతోనే హత్య చేసిందని అల్లాబకాష్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment