మాటల్లో చెప్పలేని సంతోషం
మాది అనంతపురం. నాన్న వి.ఆదినారాయణ పెయింటింగ్ కాంట్రాక్టర్, అమ్మ వి.అంజనమ్మ. డిప్లొమా కోర్సు చేసిన నేను బెంగళూరులోని ముసాచి అనే కంపెనీలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ అనుభవం కలిసొచ్చింది. ఇంటర్వ్యూలో ఏ రకంగా ప్రశ్నలు అడుగుతారనే అంశంపై యూ–ట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను. అడ్వాన్స్ టాపిక్స్‌పై దృష్టి పెట్టాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
– వి.విశ్వనాథ ఆచారి, అనంతపురం
డిప్లొమాతో
ఉద్యోగావకాశాలు పుష్కలం
డిప్లొమా పూర్తి చేసిన వారికి అద్భుతమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అర్హులైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. కళాశాలలో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
– డాక్టర్ సి.జయచంద్రారెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment