రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు | - | Sakshi
Sakshi News home page

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

Published Thu, Feb 6 2025 1:51 AM | Last Updated on Thu, Feb 6 2025 1:51 AM

రూ.40

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

..లా ఏ పనైనా మీట నొక్కితే జరిగిపోతోంది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు..పనులన్నీ జరిగిపోతున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు కూడా ‘డిజిటల్‌’ బాట పట్టారు. అందుకే లావాదేవీల్లో యూపీఐ పేమెంట్‌లు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.

హిందూపురానికి చెందిన రమేష్‌.. ఉన్నట్టుండి అనంతపురం బయలుదేరాడు. బస్సు ఎక్కాక చూసుకుంటే జేబులో డబ్బు లేదు. జేబులో ఏటీఎం కార్డు కూడా లేదు. కానీ కండక్టర్‌ చేతిలోని మిషన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఫోన్‌ పే ద్వారా డబ్బుచెల్లించి టికెట్‌ తీసుకోవచ్చని తెలిసి ఆ మేరకు తన స్మార్ట్‌ ఫోన్‌తో టికెట్‌ కొన్నాడు. ఇతరుల వద్ద చేయి చాచకుండా పని జరిగిందని సంబరపడ్డాడు.

కొత్తచెరువుకు చెందిన గంగయ్య విజయవాడకు వెళ్లి ఉన్నఫళంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. వెంటనే అక్కడకు వెళ్లిన బంధువులు... ఆయనకు రక్తం ఎక్కించాల్సిరావడంతో తెలిసిన వారి ద్వారా రక్త దాతల వాట్సాప్‌ గ్రూపులో సంప్రదించారు. అరగంటలో రక్తదాత దొరికాడు. విజయవంతంగా ఆపరేషన్‌ జరిగింది.

పుట్టపర్తికి చెందిన సాయి కారులో బెంగళూరు వెళ్తుండగా.. గోరంట్ల దాటిన తర్వాత కారు ఆగిపోయింది. వెంటనే గూగుల్‌లో సెర్చ్‌ చేసి మెకానిక్‌ నంబరు వెతికాడు. ఓ నంబర్‌కు కాల్‌ చేసి మాట్లాడాడు. అరగంటలో సమస్య పరిష్కారమైంది. వీడియో కాల్‌ ద్వారా చిన్న చిన్న పనులు చేసుకుని.. ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు వివరించాడు.

సాక్షి, పుట్టపర్తి జేబులో డబ్బులు ఉండక్కర్లేదు.. బస్సులో టికెటుకు సరిపడా చిల్లర అవసరం లేదు. రైలు ఎక్కాలంటే టికెట్‌ కొనేందుకు క్యూలో నిలవాల్సిన పని లేదు. ఫుడ్‌ కావాలంటే హోటల్‌ వరకూ వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు కావాల్సినవన్నీ ఇంటి తలుపు తడుతున్నాయి. ఫలితంగా చదువు రాని వారు కూడా ఆన్‌లైన్‌ సర్వీసులను మొబైల్‌ ద్వారా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రధాన నగరాలకే పరిమితమైన సర్వీసులు సైతం పల్లెలకు వ్యాపించాయి. ఫలితంగా ప్రతి ఒక్కరూ డిజిటల్‌ విధానాన్నే ఇష్టపడుతున్నారు. పండుగల సమయాల్లో షాపింగ్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి.

పెరిగిన డిజిటల్‌ వాడకం

జిల్లా వ్యాప్తంగా మారుమూల పల్లె నుంచి పట్టణాల వరకు డిజిటల్‌ వాడకం పెరిగిపోయింది. ఆఖరికి టీ తాగినా ఫోన్‌ పే ద్వారా డబ్బు చెల్లించే స్థాయికి చేరింది. చిల్లర సమస్య తలెత్తకపోవడంతో ఆటో డ్రైవర్లు, టీ స్టాల్‌ నిర్వాహకులు, తోపుడు బండ్లలోనూ ఆన్‌లైన్‌ పేమెంట్‌లకే జైకొడుతున్నారు.

సమయం విలువైందంటూ..

సమయం చాలా విలువైనదని అందరూ చెబుతుంటారు. డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ సర్వీసుల ద్వారా సమయం ఆదా అవుతోందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. 99 శాతం మంది ఆన్‌లైన్‌ లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. సామాన్యులు కూడా ఇంటి వద్ద నుంచి సేవలు పొందడంతో పాటు బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో ఆన్‌లైన్‌ ద్వారానే నగదు లావాదేవీలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు రవాణా వ్యయం కూడా ఆదా అవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులోకి లెక్కలేనన్ని యాప్‌లు

ఫోన్‌పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం, ఫ్యామ్‌పే, ఐఆర్‌సీటీసీ, యూటీఎస్‌, ఏపీఎస్‌ఆర్‌టీసీ, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, డిజిలాకర్‌, వేర్‌ ఈజ్‌ మై ట్రెయిన్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఏజియో, బ్యాంకు లావాదేవీల యాప్‌లు, యూట్యూబ్‌ తదితర యాప్‌లు, బ్రౌజింగ్‌ ద్వారా డిజిటల్‌ సేవలను ప్రజలు పొందుతున్నారు. అవసరాలకు అనుగుణంగా ఫోన్‌లో మొబైల్‌ నంబరు ఆధారంగా లాగిన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. నిమిషాల వ్యవధిలో సేవలు పొందుతున్నారు.

27 లక్షలు

జిల్లా జనాభా

6.3 లక్షలు

జిల్లా వాసులు

వాడుతున్న

స్మార్ట్‌ ఫోన్లు

ఆన్‌లైన్‌లోనే ఏ టు జెడ్‌ సర్వీసులు

అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌..

అంతా డిజిటల్‌ మయం

సులువుగా, వేగంగా అందుతున్న సేవలు

విస్తృతంగా వినియోగిస్తోన్న

జిల్లా ప్రజలు

నిమిషాల్లో లావాదేవీలు

స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఎలాంటి లావాదేవీలైనా నిమిషాల్లో పూర్తవుతున్నాయి. వ్యాపారాల దగ్గర ఇబ్బంది లేకుండా పోయింది. ఎంతదూరం ప్రయాణించాలన్నా.. డబ్బులు వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు. చేతిలో ఫోన్‌ ఉంటే ఎన్ని రూ.లక్షలు అయినా మోసుకెళ్లవచ్చు. దొంగల బెడద ఉండదు. ఎంతదూరం ప్రయాణించినా.. డబ్బులు తీసుకెళ్తున్నా.. జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన లేకుండా పోయింది.

– కుమ్మరి నాగరాజు, సోమందేపల్లి

చెల్లింపులు పక్కాగా ఉంటాయి

డిజిటల్‌ వ్యాపారంతో రోజుకు ఎంత వసూలైందో.. నిమిషాల్లో లెక్క కట్టవచ్చు. ఉదయం అకౌంట్‌లో లెక్క రాసుకుంటే.. సాయంత్రం ఎంత యాడ్‌ అయిందో తెలిసిపోతుంది. చెల్లింపులు పక్కాగా ఉంటాయి. చిల్లర సమస్య ఉండదు. కస్టమర్లతో ఇబ్బంది ఉండదు. జనం కూడా డిజిటల్‌ లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు.

– మహేశ్‌బాబు, టీస్టాల్‌ నిర్వాహకుడు,

కొడికొండ చెక్‌పోస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు1
1/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు2
2/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు3
3/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు4
4/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు5
5/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు6
6/6

రూ.40 లక్షల వరకు డిజిటల్‌ లావాదేవీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement