కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14న తిరుపతి జంక్షన్‌లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరే రైలు(నంబర్ 07117).. రెండు రోజుల తరువాత దానాపూర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 11.55 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (07118) అక్కడి నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తరువాత తిరుపతి జంక్షన్‌కు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుతుందన్నారు. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ, మాల్కజ్‌గిరి, చర్లోపల్లి, ఖాజీపేట మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు.
● అదేవిధంగా తిరుపతి–దానాపూర్ మార్గంలో మరో ప్రత్యేక రైలు (07119) ఈ నెల 18న నడుస్తుందన్నారు. ఆ రోజు రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుంచి బయలుదేరి రెండు రోజులు తరువాత దానాపూర్ రైల్వేస్టేషన్ రాత్రి 11.55 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి (07120) అక్కడి నుంచి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తరువాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్ చేరుకుంటుందన్నారు. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయాచూర్, కృష్ణ, యాద్గిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లోపల్లి, ఖాజీపేట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైళ్లుకు టూటైర్ ఏసీ, త్రీ టైర్ ఏసీ, స్లీపర్ కోచ్‌లతోపాటు జనరల్ బోగీలు ఉంటాయన్నారు. ప్రయాణికులు సద్విని యోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment