చేనేతకు పూర్వ వైభవం తెస్తాం
హిందూపురం: చేనేత, జౌళి రంగాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. బుధవారం ఆమె హిందూపురంలో చేనేత, జౌళి శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక యువతకు చేనేత, జౌళి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. చేనేత కార్మికుల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పింఛన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలో తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతోపాటు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా అందిస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ రాజారావు, జిల్లా ఏడీ రామకృష్ణ, డీఎస్‌డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ రమేష్‌కుమార్ ఉన్నారు.
చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
Comments
Please login to add a commentAdd a comment