హెచ్‌ఎం నాగేశ్వరరావు సస్పెన్షన్
పుట్టపర్తి: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. గోరంట్లలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, మంగళవారం విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం నాగేశ్వరరావును దండించడంతో పాటు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు హెచ్‌ఎం నాగేశ్వరరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం డీఈఓ కృష్ణప్ప హెచ్‌ఎం నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. బుధవారం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 594 మందికి గాను 549 మంది హాజరయ్యారని, మరో 45 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 482 మందికి గాను 470 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరయ్యారన్నారు. స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశ ప్రసాద్, పరీక్షల కమిటీ సభ్యులు సురేష్‌బాబు, శ్రీరామరాజు, శ్రీనివాసరెడ్డి ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షించారని వెల్లడించారు.
అక్రమాలను సహించం
● రేషన్ పంపిణీ, ‘దీపం–2’
పక్కాగా అమలు చేయాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ, దీపం –2 పథకం అమలులో అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, జిల్లా మేనేజర్‌తో పాటు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఎండీయూ వాహనాలు, రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకుల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. ‘దీపం–2’ పథకం ద్వారా లబ్ధిదారులకు సకాలంలో సబ్సిడీ సొమ్ము జమ కావాలన్నారు. అలాగే అర్హులందరికీ లబ్ధి చేకూరేలా గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వ్యవహరించాలన్నారు. అక్రమాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డీలర్‌షిప్ రద్దు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment