యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు

Published Wed, Feb 12 2025 12:39 AM | Last Updated on Wed, Feb 12 2025 12:39 AM

యథేచ్

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం ప్రియులకు కూటమి సర్కారు ఝలక్‌ ఇచ్చింది. పాలన చేపట్టిన తొలినాళ్లలో మద్యం ధరలు తగ్గిస్తున్నామని, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు.. 9 నెలలు కూడా పూర్తికాకుండానే మద్యం వినియోగదారుల నడ్డి విరిచారు. ఇప్పటికే పర్మిట్‌ రూములు, బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతుండగా దీన్ని ఆసరాగా చేసుకుని 15 శాతం మద్యం రేట్లు పెంచారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు దక్కించుకున్న మద్యం షాపులన్నీ బార్‌లను తలపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు తమ ఎమ్మెల్యేల కోసం 10 శాతం ఉన్న మార్జిన్‌ను.. 14 శాతానికి పెంచారు. మార్జిన్‌తో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు లాభపడుతున్నారు. మద్యం ధరలు పెంచి సర్కారూ ఆదాయ వనరులు పెంచుకుంది. మధ్యలో వినియోగదారులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

రోజుకు రూ.65 లక్షలు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెరిగిన మద్యం ధరల కారణంగా రోజుకు సగటున రూ.65 లక్షల వరకూ వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే రోజూ రూ.4.50 కోట్లు మద్యం వినియోగమవుతోంది. ఇందులో 15 శాతం పెరిగితే రూ.67 లక్షలు అవుతుంది. సగటున రోజూ 6 లక్షల మందిపైగా మద్యం తాగుతున్నట్టు అంచనా. ఇందులో ఎక్కువమంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. మరోవైపు, మద్యం షాపులు దక్కించుకున్న వారిలో 90 శాతం మంది టీడీపీ నాయకులే. వారికోసం నిన్నటిదాకా 9.5 శాతం ఉన్న మార్జిన్‌ మనీ 14 శాతానికి పెంచారు. దీంతో నెలకు రూ.కోట్లలో చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు 15 శాతం పెంచడంతో సర్కారుకు ఉమ్మడి జిల్లా నుంచి నెలకు రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఎటొచ్చీ నలుగుతోంది సామాన్యులే కావడం గమనార్హం.

మద్యం ప్రియుల్ని బకరాలను చేసిన బాబు

ధరలు తగ్గిస్తున్నట్టు గతంలో చెప్పి

నేడు భారీగా పెంపు

వైన్‌షాపుల నిర్వాహకులకు 14 శాతం మార్జిన్‌

వినియోగదారులపై రోజుకు రూ.65 లక్షల భారం

ఇప్పటికే బార్‌లను తలపిస్తున్న టీడీపీ నేతల వైన్‌షాపులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 236 వరకూ మద్యం షాపులున్నాయి. గతంలో మద్యం షాపుల్లో మందు కొనుక్కునే వరకే ఉండేది. ఇప్పుడు మాత్రం కొన్నచోటే తాగేలా అనధికార పర్మిట్‌ రూములు ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బార్‌లను తలపించేలా యథేచ్ఛగా పర్మిట్‌ రూములు తెరిచారు. ఇక ప్రతి గ్రామంలో బెల్టుషాపులు వేలం పాటలు నిర్వహించి మరీ పెట్టడం కూటమి సర్కారు తీరుకు అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే మద్యం రేట్ల పెంపుతో సామాన్యులు సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు 1
1/3

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు 2
2/3

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు 3
3/3

యథేచ్ఛగా పర్మిట్‌రూములు, బెల్టు షాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement