బెల్టుషాపులు పెడితే కేసులు
ఇచ్ఛాపురం: మద్యం దుకాణాదారులు ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డి.సి. డి.శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పురుషోత్తపురం చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి వంటి నిషేద పదార్థాలు అక్రమంగా రవాణా జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బెల్ట్‌షాపు నిర్వాహకులపై కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఎస్‌ఐ పి.డి.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎండీయూ ఆపరేటర్
కుటుంబానికి చేయూత
శ్రీకాకుళం/మెళియాపుట్టి : మెళియాపుట్టి ఎండీయూ(బియ్యం పంపిణీ) ఆపరేటర్ సాయిరాజ్ ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆర్థికభరోసా కల్పించింది. మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ చేతుల మీదుగా రూ.70 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 76 మంది ఎండీయూ ఆపరేటర్లు మృత్యువాత పడ్డారని, వారికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడాలని కోరారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు హేమసుందర్, వరహాలు, నరసింహులు, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదంలో వలలు దగ్ధం
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తదిబ్బలపాలెం సముద్ర తీరంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో చేపల వలలు దగ్ధమయ్యాయి. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్ తాళ్లతో ఉన్న వలలకు నిప్పంటుకోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో వలలు కాలిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు చీకటి పండువాడు, రాము, సూరాడ కూర్మయ్య, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత అక్టోబర్ 21న డి.మత్స్యలేశం తీరంలోనూ ఇలాగే వలలు కాలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందో కారణం తెలియలేదు. ప్రమాదమా? వ్యక్తిగత కక్షలతో నిప్పుడు పెడుతున్నారా అన్నది తెలియడం లేదు.
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు అక్షయ
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్–2024 పోటీలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ అక్షయ ఎంపికై ంది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పంజాబ్‌లోని పటియాల వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన 68వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికై ంది. కాగా జాతీయ పోటీల కోసం పయనమై వెళ్లిన అక్షయను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి అభినందించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment