కోవిడ్ బాధితులకు నగదు అందజేత
శ్రీకాకుళం అర్బన్: కోవిడ్ ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలలకు బుధవారం శ్రీకాకుళంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో అధికారుల సమక్షంలో నగదు అందజేశారు. కోవిడ్‌తో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు 2021లో పీఎంకేర్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద జిల్లాలో 9 మంది కోవిడ్ అనాథ బాలలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేశారు. శ్రీకాకుళంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గార్డియన్‌గా చిన్నారులతో జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేయించి ఆ పదేసి లక్షల రూపాయలను డిపాజిట్ చేశారు. చిన్నారులకు 18 ఏళ్లు నిండిన తర్వాత సింగిల్ అకౌంట్‌గా ఆ మార్చి.. ప్రతినెల స్టైఫండ్ కింద రూ.5500 ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విధంగా జమ అయిన మొత్తం వి.వెంకటేశ్వరరావు రూ.84వేలు, బి.పార్థసారధి రూ.లక్షా 68వేలు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ మొత్తాలను బుధవారం ప్రధాన పోస్ట్ సూపరింటెండెంట్ వి.హరిబాబు, జిల్లా బాలల రక్షణ అధికారి కెవీ రమణ, హెడ్‌పోస్ట్ మాస్టర్ పి.రంగరావు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఎం.భానోజీరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలల రక్షణ అధికారి (ఎన్‌ఐసీ) ఐ.లక్ష్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ క్రీడలకు
పొన్నాడ కేజీబీవీ విద్యార్థిని
ఎచ్చెర్ల క్యాంపస్: పొన్నాడ కేజీబీవీ ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది విద్యార్థిని సీహెచ్ రమ్య జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికై ంది. బేస్‌బాల్ అండర్–19 పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో మహరాష్ట్రలో జరగనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన ద్వా రా ఈ విద్యార్థిని ఎంపికై ంది. ప్రత్యేక అధికారి సుర్యకళ, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు.
సెలవులోకి విచారణాధికారి
టెక్కలి: టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసో త్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా అధికారి ప్రస్తుతం సెలవులోకి వెళ్లిపోవడం జిల్లా వ్యాప్తంగా ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇటీవల అక్కడ ఉత్సవాల నిర్వహణలో ఈఓ గురునాథరావు నిర్లక్ష్య వైఖరితో చోటు చేసుకున్న అక్రమాలపై బీజేపీ, జనసేన నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడం.. ఆ తర్వాత ఏసీ ప్రసాద్‌పట్నాయక్ విచారణ చేపట్టడం తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈఓ గురునాథరావుకు, ఏసీ ప్రసాద్‌పట్నాయక్‌కు తెర వెనుక ఉన్న గురు శిష్యుల బంధంతో విచారణ పక్కదారి పడుతుందని శాఖాపరంగా వెల్లువెత్తిన సందేహాలపై సాక్షిలో కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయం దేవదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్లింది. అయితే విచారణలో ఈఓను రక్షించేందుకు చేసిన ప్రయత్నాల్లో ఇరువురి బంధం బహిర్గతం కావడంతో వ్యక్తిగత కారణాలు చూపించి ఏసీ సెలవులోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది. విచారణలో లోపాలు కనిపిస్తే విషయాన్ని దేవదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదుదారులు తెలిపారు.
చిరు జల్లులతో రైల్వే పరీక్ష అభ్యర్థుల అవస్థలు
నరసన్నపేట: స్థానిక కోర్ టెక్నాలజీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరిధిలో బుధవారం పలు విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించగా సుమారు 450 మంది హాజరయ్యారు. అయితే ఒడిశాతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి వాతావరణం మారడం, చిరు జల్లులు పడుతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న కోర్ టెక్నాలజీ భవనం పరిసరాల్లో ఎలాంటి షాపులు, ఇళ్లు లేకపోవడంతో జల్లులకు అవస్థలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment